Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి సమక్షంలో అనకాపల్లి యూత్ ప్రెసిడెంట్ వేగి త్రినాథ్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం, మొండి పాలెం గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ తో పాటు 15 మంది సభ్యులు వైఎస్సార్సీపీ లో చేరారు. వీరికి మాలసాల భరత్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. వీరిలో రాజు, శివ, హరీష్,మోహన్, పరమేష్,మోహన్ రావు, శ్రీను, చిన్నారావు తదితరులు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్ పాల్గొన్నారు.
Admin
Rapid TV