Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ జులై 22:: జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం) కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయని , ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., ఆదేశించారు. ఈ 37 ఫిర్యాదులలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు మరియు చీటింగ్ తదితర ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, ఎస్సై సావిత్రి పాల్గొన్నారు.
Admin
Rapid TV