Sunday, 13 September 2026 04:19:35 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్ రద్దు చేయాలి సీఐటీయు

Date : 30 January 2026 07:55 PM Views : 291

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్కేం టివి రావికమతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల నశించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రావికమతంలో శుక్రవారం సదస్సు జరిగింది. సిఐటియు మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి అధ్యక్షతన జరిగిన సదస్సులో సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చిందని ఇవి కార్మికులకు ఉరుతాడుగా భావించాలని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రంగాల కార్మికులకు విస్తృతంగా ప్రచారం చేసి ఫిబ్రవరి 12వ జరుగు జాతీయ సమ్మెలో కార్మికుల యావత్తు భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి 12 గంటల పెంచటం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కార్మికులకు పర్మినెంట్ చేయకుండా వెట్టి చాకిరి చేయించటం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పని హక్కుకు గ్యారెంటీ లేకుండా చేయటం సమ్మెహక్కును హరించటం వంటి ప్రమాదకరమైన విధానాలు ఈ లేబర్ కోడ్ లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా,మధ్యాహ్న భోజన పథకం,ముఠా, ఆటో కార్మికులు ఎస్ సత్యవేణి కే దేవి, ఎస్ అమ్మాజీ బి సత్యవతి, దానయ్య దండిపాటీ శ్రీను మరియు ముఠా కార్మికులు ఆటో కార్మికులు ఆశా వర్కర్లు మధ్యాహ్నం భోజనం కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :