Thursday, 30 July 2026 04:14:20 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఆగస్టు 15వ తేదీన అనకాపల్లిలో

Date : 13 August 2024 06:08 PM Views : 364

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉచిత మేగా కంటి వైద్య శిబిరం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్ & కంటి ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో అనకాపల్లి ఏ ఎం ఏ ఏ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 తేదీ గురువారం నాడు ఉచిత మేగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని రాజా ఆప్టికల్స్ & కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో అత్యధికమైన కంప్యూటర్లపై కంటి వైద్య నిపుణులతో కంటి పరీక్షలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రకముల వ్యాధులకు అనగా కళ్ళు మసకగా కనబడుట, కళ్ళ నుండి నీరు కారుట, కళ్ళు ఎరుపుగా అవుట, కళ్ళు దురద పుట్టుట, దగ్గర చూపు దూరము చూపు సరిగా కనిపించకపోవడం, కంటిపై వచ్చే కండ, మెల్లకన్ను సరిచేయుట, 14 సంవత్సరముల లోపు పిల్లలకు క్యాటరాక్ట్( శుక్ల0), షుగర్ వ్యాధిగ్రస్తులకు వచ్చే కంటి నరం వ్యాధులకు, కంటి గుడ్డి కి సంబంధించిన కొన్ని వ్యాధులకు, నల్లగుడ్డు మార్పిడి వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయబడునని తెలియజేశారు. మరియు అవసరమైన వారికి మందులు ఉచితముగా ఇవ్వబడును అని అన్నారు. ఆపరేషన్ అవసరమైన వారిని అదే రోజు శంకర్ ఫౌండేషన్ బస్సులో విశాఖపట్నం తీసుకుని వెళ్ళబడునని తెలియజేశారు. కళ్ళజోడు అవసరమైన వారికి 50% తగ్గింపుతో అనకాపల్లి లో వున్న రాజా ఆప్టికల్స్ & కంటి ఆస్పత్రి వారి ద్వారా ఇవ్వబడునని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రుసుము తీసుకోకుండా అన్ని కంటి తనిఖీలు మరియు అత్యాధునికమైన పద్ధతిలో కంటి ఆపరేషన్లు నిర్వహించబడును పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఆరోగ్య భద్రత ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఈసిహెచ్ఎస్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత కంటి తనిఖీలు చేయబడినని ఉద్యోగులు వారి మెడికల్ హెల్త్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :