Sunday, 13 September 2026 10:50:27 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Date : 11 March 2024 07:49 PM Views : 292

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం... నిర్వహించిన వాసవి క్లబ్ వనిత అనకాపల్లి కమిటీ సభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి మహిళలకు సమాన హక్కు ఉండాలి :: ఎంపీ డాక్టర్ బిశెట్టి సత్యవతి మహిళలకు సమాన హక్కు ఉండాలని ఆ ఉద్దేశంతోనే సిఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి శెట్టి సత్యవతి అన్నారు. మహిళను అన్నీ రంగాలలో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలను మన ప్రధానమంత్రి మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. ప్రతి రంగంలో కూడా మహిళలు అభివృద్ధి సాధించాలని కోరారు. ఒక మహిళగా ఒక డాక్టర్గా మహిళలకు ఏమి కావాలో తనకు తెలుసునని గత ఐదు సంవత్సరాలుగా ఆ విధంగా నేను కృషి చేశానని తెలిపారు. మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే తనకు స్వాతంత్రం వస్తుందని ఆ దిశగా ప్రతి మహిళ అడుగు వేయాలని అన్నారు. వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇంత పెద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చేయడం తను మొదటిసారి చూస్తున్నానని ఈ విధంగా ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ప్రెసిడెంట్ జంగాల ఫణి నీ ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి తనని ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాసవి క్లబ్ వనిత వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వాసవి క్లబ్ వనిత అనకాపల్లి వారు ఎంపీ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం మరియు రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి మహిళ మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు చేస్తామని, కళ్ళజోళ్లు రాయితీకి అందిస్తామని, ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి క్లబ్ వనిత అనకాపల్లి కమిటీ వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మరో ముఖ్య అతిదులు మలసాల భరత్ కుమార్ దంపతులను కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రతి మహిళ అభివృద్ధికి చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి, వాసవి క్లబ్ గవర్నర్ వై నర్సింగరావు, వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ప్రెసిడెంట్ జంగాల ఫణి, సెక్రెటరీ గుర్రం సువర్ణ, ట్రెజరర్ దాసరి సునీత, ప్రోగ్రాం చైర్ పర్సన్స్ డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరు పూర్ణిమ, పుట్ట పద్మజ, ఉప్పల శ్యామల వాసవి క్లబ్ వనిత సభ్యులు, విశాఖ ఉమ్మడి జిల్లా నుండి వాసవి క్లబ్ వనిత సభ్యులు హాజరయ్యారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :