Thursday, 30 July 2026 12:45:57 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన

పట్టణ నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్డ్ తరలించాలని ఆదేశం, కాలువలో సిల్ట్ తీయాలని ఆదేశం, పెరుగు బజార్ విస్తరణ పనులు ప్రారంభించాలని ఆదేశం

Date : 24 June 2024 06:05 PM Views : 862

Rapid TV - Andhra Pradesh / Anakapally : మాజీ మంత్రివర్యులు. స్థానిక శాసనసభ్యులు. కొణతాల రామకృష్ణ సోమవారం అనకాపల్లి పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా అనకాపల్లి పురపాలక సంఘంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. తక్షణం యాడ్ ను ఇక్కడ నుండి తరలించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా వున్న పెరుగుల బజార్ నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు. తక్షణం రోడ్డును నిర్మించాలని దానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మరియు బిల్డింగులు పోయిన బాధితులకు తక్షణం టిడిఆర్స్ ఇవ్వాలని దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చూడమని కమిషనర్ ను ఆదేశించారు. అక్కడ నుండే విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ తో ఫోన్లో సంప్రదించి పైన తెలిపిన పనుల గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు మరియు 2004లో తాను మంత్రిగా ఉండగా నిర్మాణం చేసినటువంటి కాలువల లైనింగ్ పనులను పరిశీలించి వాటిని సిల్టు తీయించి శుభ్రముగా ఉంచాలని అలాగే రైతులకు నీరు పారడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ఉన్న మురికి కాలువ అన్నిట్లోనూ వర్షాకాలం దృష్ట్యా ముందుగానే కాలువలో పేరుకుపోయిన సిల్ట్ మరియు వ్యర్ధ పదార్థాలను తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే విజయనగరం రోడ్డు లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అక్కడున్న రైల్వే బ్రిడ్జి రిపేర్లు చేయించి దాన్ని పరిశుభ్రపరిచి ఆ మట్టి చెత్త చెదారం అంతా తొలగించాలని ఆదేశించారు, అలాగే పట్టణంలో కావలసినటువంటి పలు మౌలిక వసతులు. రోడ్ల నిర్మాణాలు. మంచినీటి ఇబ్బందులు .శానిటేషన్ పై పలు సూచనలు చేసి ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కావలసిన ఏర్పాట్లు చూడాలని దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. రూరల్ ప్రాంతంలో కూడా తనదైన శైలిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన అనకాపల్లికి మంచి రోజులు వచ్చాయని కొణతాల పర్యటనను చూసిన స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు..

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :