Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ, : మండలంలోని పాల్మెన్ పేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ మత్స్యకార నాయకులు మైలపల్లి అశోక్ చక్రవర్తి కుమారుడు అద్విత్ ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ లో సత్తా చాటాడు. ఒలింపియాడ్ ఛాంపియన్ పిటి ఉష ఆధ్వర్యంలో భారతదేశ నెంబర్ వన్ "ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ " నిర్వహించిన ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఒ) కాంపిటీషన్ లో అద్విత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదటి రౌండ్ లో 48 వ ర్యాంకు, రెండవ రౌండులో 135 వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఇదే సమయంలో అద్విత్ చదరంగం పోటీల్లోనూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. అద్విత్ ప్రస్తుతం రాజమండ్రి భోది ఇంటర్నేషనల్ స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అద్విత్ తల్లి మాలతి రాజమండ్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి మైలపల్లి అశోక్ చక్రవర్తి పాయకరావుపేట మండలంలో మత్స్యకార నాయకులుగా పని చేస్తున్నారు. పిన్న వయస్సులోనే మాథ్స్ ఒలింపియాడ్, చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరుస్తోన్న అద్విత్ ను పాఠశాల అధ్యాపకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందించారు.
Reporter
Rapid TV