Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రావికమతం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు ముఖా మహాలక్ష్మి నాయుడు, కంచిపాటి జగన్నాథరావు పైలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు ముక్కా మహ లక్ష్మి నాయుడు మాట్లాడుతూ అందరి మనసులోనూ కొలువై ఉన్న నేత వైయస్సార్ అని, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నేటికీ ఆదర్శప్రాయం అని అన్నారు. కంచిపాటి జగన్నాధ రావు మాట్లాడుతూ వైయస్సార్ పథకాలు దేశమంతా ఆదర్శమయ్యాయని ప్రతి రాష్ట్రంలోనూ ఆయన పథకాలను కొనసాగిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా ఈశ్వరరావు, కసిరెడ్డి ప్రసాద్, రాము నాయుడు, గణేష్ తాతారావు ఈశ్వర రావు పండూరి సత్తిబాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV