Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి : అనకాపల్లి పట్టణంలోని సామాజిక వన విభాగం, డివిజనల్ ఫారెస్ట్ అధికారి వారి కార్యాలయంలో ఆదివారం ఉదయం అటవీ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా డివిజనల్ ఫారెస్ట్ అధికారి గంపా లక్ష్మణ్ అమరవీరుల వివరాలతో కూడిన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ అమరవీరులకు జోహార్లని, 1939 నుంచి నేటి వరకు ఎంతో మంది అటవీ అధికారులు వారి యొక్క విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అమరులైనారని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్లు అమరులై నేటి తరానికి భావితరాలకు ఆదర్శప్రాయులయ్యారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అటవీ సంరక్షణ, ప్రభుత్వ కార్యక్రమాలు అమలులో అధికారులు అంకితభావంతో పని చేసిననాడు వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని నాలుగు రేంజ్ ల అధికారులు సెక్షన్ ఆఫీసర్లు కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.
Admin
Rapid TV