Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అచ్చుతాపురం గత సంవత్సరం నుండి అనారోగ్యం కారణంగా కష్టపడుతున్న మడుతూరు గ్రామానికి చెందిన సంతోషి అనే ఆమెకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్నేహాంజలి పూర్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ ద్వారా అందించబడింది. రైల్వే టిటిఈ మలిజెడ్డి అప్పారావు బాధితురాలి పరిస్థితిని సంస్థ వ్యవస్థాపకుడు బోగేష్‌కి తెలియజేశారు. అనంతరం బాధితురాలను కేజీహెచ్ లో పరామర్శించి, వారి గ్రామానికి వెళ్లి సహాయం అందించారు. సంస్థ చేస్తున్న సహాయ కార్యక్రమాలను తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడమట సతీష్, వార్డు సభ్యుడు నాగేశ్వరావు, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మలిజెడ్డి రమణారావు, పాల్గుణ్, చంటి, సంధీ శ్రీను, చిలుకు, అబద్దం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV