Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక్కసారిగా పరిగెత్తించిన అనకాపల్లి ఎం.పీ సీఎం రమేష్ ప్రమాణస్వీకారానికి ముందే పెండింగ్ పనులు మీద సమీక్షలు... ఇచ్చిన హామీలు మీద పూర్తి స్థాయి లో దృష్టి... అనకాపల్లి జిల్లా అభివృద్ధి లో తగ్గేదేలేదు అంటూ,అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన అనకాపల్లి ఎం.పీ *నెలరోజుల్లో జల్లూరు బ్రిడ్జ్ ప్రారంభించెలా తక్షణమే పనులు ప్రారంభించండి అని ఆదేశాలు జారీ.* *ఇప్పటికే 5ఏళ్లుగా రావాల్సిన 62లక్షలు రూపాయలు బకాయిలు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు, మరో కొంత మొత్తం సొమ్ము వెచ్చించాలా అని ఆవేదన వ్యక్తం చేసిన బ్రిడ్జ్ కాంట్రాక్టర్.* *ప్రభుత్వం నుండి వచ్చే బిల్లులు గురించి ఆలోచించకండి అవసరం అయితే సొంత నిధులు ఇస్తాను బ్రిడ్జి పనులు మొదలుపెట్టి నెలరోజుల్లో ప్రారంభించిడానికి సిద్ధం అవ్వండి అని తెలియజేసిన అనకాపల్లి ఎం.పీ శ్రీ సీ.ఎం రమేష్ గారు.* *ఇన్నాళ్లుకు మాకు సరైన నాయకుడు దొరికాడు అని హర్షం వ్యక్తం చేసి బాణా సంచా కాల్చి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన కోటఊరట్ల మండల ప్రజలు.* పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం జల్లూరు గ్రామం దగ్గర ఉన్న నర్సీపట్నం రేవు పోలవరం రోడ్డు మధ్య ఉన్న బ్రిడ్జి ను శనివారం మధ్యాహ్నం స్థానిక అధికారులతో కలిసి బ్రిడ్జి ను పరిశీలించడానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ గారు అధికార యంత్రాంగం, బ్రిడ్జ్ కాంట్రాక్టర్ మరియు స్థానిక నేతలతో కలిసి వచ్చారు. బ్రిడ్జి గురించి ఇప్పటివరకు జరిగిన స్టేటస్ ను అధికారులును అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల కన్స్ట్రక్షన్ కి చెందిన బ్రిడ్జి కాంట్రాక్టర్ బ్రిడ్జ్ కొరకు మేము ఖర్చుపెట్టిన డబ్బులు గురించి ప్రభుత్వం చుట్టూ ఐదేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నామని మాకు రావలసిన 62 లక్షల రూపాయలు నేటికీ చెల్లించలేదని అందుకే బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. శ్రీ సీఎం రమేష్ గారు మాట్లాడుతూ పూర్వ బకాయిల గురించి ఆలోచించకుండా తక్షణమే పనులు ప్రారంభించండి గత బకాయిలు మరియు ఇప్పుడు మీరు ఖర్చు చేసే మొత్తాన్ని మీకు ఎంపీ గ్రాంట్ ద్వారా పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రయత్నిస్తానని ఒకవేళ కుదరలేని పరిస్థితిలో సి ఎస్ ఆర్ నిధులు ద్వారా అయినా సరే మీకు చెల్లించే బాధ్యత తీసుకుంటానని. అది కూడా కుదరలేని పక్షంలో నా సొంత డబ్బుల్ని మీకు చెల్లిస్తాను రేపటి నుండి పనులు ప్రారంభమయ్యేలా నెల రోజులు సమయంలో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం కండి అని సీఎం రమేష్ గారు తెలియజేశారు. రెండు ప్రధానమైన నగరాలను కలిపె ఈ యొక్క రహదారిలో ప్రధానమైన బ్రిడ్జ్ ను కుడా పూర్తి చేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని, ఈ యొక్క బ్రిడ్జి కారణంగా నిత్యం కొన్ని వందల మంది ప్రజల అవస్థలు పడుతున్నారని, వర్షాకాలంలో వరాహనది పొంగడం ద్వారా కూడా ప్రయాణికులకు తీవ్ర అంతారాయం కలుగుతుందని, దానికి తోడుగా ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు గురి అయిన బ్రిడ్జి మీద అనేక ప్రమాదాలు జరిగాయని కానీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా గత ప్రభుత్వం లో స్థానిక శాసనసభ్యుడు నిత్యం ఈ రోడ్డు కూడా ప్రయాణం చేసిన పట్టించుకోలేని పరిస్థితిలో ఉండటం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి గారు మరియు స్థానిక కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV