Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం అచ్చుతాపురం గ్రామంలో నల్లమారమ్మతల్లి జాతర లో మరియు అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో నూకాంభిక అమ్మవారి మరియు అభయాంజనేయ స్వామి తీర్ధ జాతర సందర్భంగా ఆ గ్రామాల ప్రజలు మరియు జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు.అనంతరం జనసేన శ్రేణులు మరియు ఆలయ కమిటీ సభ్యులు భాస్కరరావు గారిని సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కశింకోట మరియు అనకాపల్లి మండలం కమిటీల సభ్యులు,జనసైనికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV