Rapid TV - Andhra Pradesh / Anakapally : ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ సంక్షేమ సంఘం అనకాపల్లి వారి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఫార్మాసిస్టుల సమైక్య సంఘం జనరల్ సెక్రెటరీ రత్నాల ప్రకాష్ పర్యవేక్షణలో రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అనకాపల్లి, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం వారి సహకారంతో అనకాపల్లి మండలం బి ఆర్ టి కాలనీ లో శ్రీ శక్తి మెడికల్స్ వద్ద ఉచిత కంటి మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ స్వామినాయుడు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారి ప్రాణాలను కాపాడతాయని అన్నారు. ఉచిత కంటి మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదవారికి కంటి చూపును వారి జీవితాలలో వెలుగును ప్రసాదిస్తున్న రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. 40 మందికి కళ్ళజోళ్లను తక్కువ ధరలకు అందించారు.ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎప్పుడు తన సహాయ సహకారాలు ఉంటాయని ci స్వామి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోల్లేటి శివాజీ, ఎల్లపు వెంకటరావు, శ్రీనివాసరావు, అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ చరపాక హేమంత్, ఫార్మసిస్ట్లు జి మంగయ్య, గిరిజా రాణి, డాక్టర్ నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV