Thursday, 30 July 2026 12:43:24 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

తాండవ జలాశయ ప్రధాన గేట్లను మరమ్మత్తులు చేపట్టాలి* *జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర డిమాండ్*

Date : 14 February 2024 11:15 AM Views : 277

Rapid TV - Andhra Pradesh / Anakapally : తాండవ జలాశయ ప్రధాన గేట్లను మరమ్మత్తులు చేపట్టాలి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర డిమాండ్ *ఈ నెల 17న నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం* *నాతవరం* జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ అయిన తాండవ జలాశయ ప్రధాన గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం తాండవ జలాశయాన్ని సందర్శించి గేట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గేట్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి వివిధ రూపాల్లో తెలియజేశామన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఇటీవల వర్షాభావ పరిస్థితుల్లో సుమారు 28వేల ఎకరాల వరకు పంట పొట్ట దశలో ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు కనీసం గేట్ల మరమ్మత్తులపై ఎటువంటి దృష్టిసారించకపోవడం దారుణమన్నారు. తాండవ గేట్ల మరమ్మత్తులు చేపట్టేందుకు రైతుల పక్షాన జనసేన ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. వచ్చే పంట కాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తక్షణమే 7లక్షల గ్రాంటు విడుదల చేసి మరమ్మత్తులు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలబడాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 17న శనివారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షులు వెలగల వెంకటరమణ, మండల సంయుక్త కార్యదర్శి మంకు కృష్ణకుమార్, మాక్రెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గన్నారు

L.V.RAMANA NARSIPATNAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :