Monday, 14 September 2026 04:39:18 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ఘనంగా మంత్రి అమర్నాథ్ జన్మదిన వేడుకలు

Date : 21 January 2024 11:42 PM Views : 210

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఘనంగా మంత్రి అమర్నాథ్ జన్మదిన వేడుకలు -- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు ఒకరోజు ముందే అంటే ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మిందిలోని మంత్రి అమర్నాథ్ క్యాంప్ కార్యాలయంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు పార్టీ కార్యకర్తలు, నాయకులు మంత్రి అమర్నాథ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. వైసిపి సీనియర్ నాయకులు గుడివాడ అప్పల రామ్మూర్తి, కార్పొరేటర్ గుడివాడ లతీష్ అనూష ఆధ్వర్యంలో మింది జంక్షన్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుతో వచ్చిన అమర్నాథ్ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు నగర మేయర్ హరి వెంకట కుమారి దంపతులు, చొక్కాకుల వెంకటరావు తదితరులు మంత్రి అమర్నాథ్ కు పుష్ప గుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మింది గ్రామమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పులి వేషాలతో సహా డప్పు వాయిద్యాలు, విభిన్న కళాకారుల నృత్య ప్రదర్శనలతో మంత్రి అమర్నాథ్ ను ఇంటి వరకు తీసుకొచ్చారు. అక్కడ పలువురు అధికారులు అనధికారులు మంత్రి అమర్నాథ్ ను పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తల నడుమ మంత్రి అమర్నాథ్ కేక్ కట్ చేశారు. మంత్రి అమర్నాథ్ పుట్టినరోజు వేడుకలలో మింది గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కసింకోట జడ్పిటిసి శ్రీధర్ రాజు తోపాటు అనేకమంది నాయకులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :