Tuesday, 28 July 2026 10:48:44 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

పూడిమడక వద్ద షిప్పింగ్ హార్బర్ నిర్మాణం సకాలంలో పూర్తి:: ఎంపీ సీఎం రమేష్

Date : 06 February 2025 07:27 AM Views : 337

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సకాలంలో పూర్తి చేస్తామని డాక్టర్ ఎంపీ సి.ఎం. రమేష్ అన్నారు. డిసెంబర్ లో జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో రూల్ 377 అంశం క్రింద అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ను సకాలంలో పూర్తి చేయాలని లోక్ సభలో చర్చించిన అంశంపై స్పందిస్తూ కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రి లేఖ వ్రాశారు. పూడిమడక వద్ద మత్స్య ప్రాజెక్టు సకాలంలో అభివృద్ధి చేస్తే ఆర్ధిక అవకాశాలు పెరగడంతోపాటు, ఆహార భద్రత మెరుగుపడి, సామాజిక సాధికారతను పెంపొందించి తీర ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని ఎంపీ సిఎం రమేష్ అన్నారు. సాగర మాల పథకం క్రింద సముద్రతీర ప్రాంత ప్రజల అభివృద్ధికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ అన్నివిధాల సహయ సహకారాలు అందిస్తుంది అని, అక్కడి ప్రజల ఆర్ధికాభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనొవాల్ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్ర మత్స్య శాఖ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాగరమాల పథకం కింద చేపట్టిన అనకాపల్లి జిల్లాలోని పూడిమడక ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు కు సాగర్ మాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే నలభై కోట్ల రూపాయల ఆర్థిక నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి అభ్యర్ధనల వచ్చిన తరువాత అవసరమైన చర్యలను తీసుకుని ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :