Rapid TV - Andhra Pradesh / Anakapally : *????అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం???? అనకాపల్లి ఏ ఎం ఏ ఎల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ కార్యవర్గ సమావేశం జూన్ 12, బుధవారం ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో జరిగింది. సంఘ అధ్యక్షులు బొడ్డేడ అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కళాశాలకు నాక్ గ్రేడింగ్ లో గుర్తింపు వచ్చే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని, త్వరలోనే పూర్వ విద్యార్థుల సంఘం వార్షికోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించారు, ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెనుమత్స కృష్ణంరాజు, కోశాధికారి వై.జగదీశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ గెల్లా జయ బాబు, పర్యవేక్షికరాలు పెంటకోట అనురాధ, కార్యవర్గ సభ్యులు బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు, పద్మనాభుని రాజేశ్వరి ప్రసాద్, కొణతాల రామచంద్రరావు, బొత్స సాగర్, కోరిబిల్లి కన్నారావు, డాక్టర్ కె ఏ ఎస్ నాయుడు, ఐ క్యు ఎ సి కన్వీనర్ నిరంజన్ కుమార్, అంకం రెడ్డి సూరిబాబు, డాక్టర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV