Rapid TV - Andhra Pradesh / Anakapally : జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV