Saturday, 12 September 2026 08:03:39 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

దుర్గా దేవి ఆలయం లో కుంకుమ పూజలు.

Date : 30 August 2024 08:06 PM Views : 185

Rapid TV - Andhra Pradesh / Anakapally : దుర్గాదేవి ఆలయంలో కుంకుమ పూజలు యలమంచిలి : శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని యలమంచిలి మండలం, పద్మనాభరాజు పేట గ్రామంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో అమ్మవారిని, ఆలయాన్ని పసుపు కొమ్ములు, గాజులతో అలంకరించారు. ఇందులో భాగంగా పీ ఎన్ ఆర్ పేట, బయ్యవరం ఉభయ గ్రామాలకు చెందిన పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కొమ్ములు, గాజులను తీసుకొని వెళ్ళి కమిటీ సభ్యులకు సమర్పించడంతో, వాటితో వారు ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అర్చకులు గౌరీ శంకర్ శర్మ మంత్ర ఉచ్చరణ నడుమ తెల్లవారి నుంచి దుర్గాదేవి అమ్మ వారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. తరువాత మధ్యాహ్నం వరకు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హరి భజన చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొగ్గా బుజ్జి, జెర్రిపోతుల నానాజీ, రాయివరపు వెంకట్, మొల్లి అప్పారావు, కలిగట్ల నానాజీ, వై నాగేశ్వరావు, వై జానకి తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :