Rapid TV - Andhra Pradesh / Anakapally : టీమిండియా క్రికెటర్ వికెట్ కీపర్ విశాఖ ముద్దుబిడ్డ భరత్ ను బైరా ఫౌండేషన్ తరపున దిలీప్ చక్రవర్తి అభినందించి గౌరవ సన్మానం చేసారు. ఈ సందర్భంగా బైరా దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ బైరా ఫౌండేషన్ తరపున వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. విశాఖపట్నం ,అనకాపల్లి జిల్లాలలో క్రీడల అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లాలో క్రికెట్ అకాడమీ పెట్టాలని,అది తన విజన్ అని తెలియజేశారు. అనకాపల్లి పార్లమెంట్ ప్రాంతం నుంచి ఇండియా టీం కి మరియు ఐపిఎల్ కి ప్రాతినిధ్య వహించేలా క్రీడాకారులను తయారు చేయడం బైరా లక్ష్యం అని తెలియజేశారు. దీనికి భరత్ సహాయ సహకారాలు అందించాలని కోరగా ఇండియన్ వికెట్ కీపర్ భరత్ తప్పక తన సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. దిలీప్ గారు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Admin
Rapid TV