Rapid TV - Andhra Pradesh / Anakapally : రేపిడ్ టివి రావికమతం : మండల కేంద్రంలో రావికమతం మెయిన్ రోడ్డు నుంచి చెరుకు కాటా వరకు సిసి రోడ్డు పనులను స్థానిక తెదేపా నేతలు ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ మరో ఎంపీటీసీ వేపాడ నాగేశ్వర్రావు లు సోమవారం ఉదయం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ బి.ఎన్ రోడ్ నుంచి చెరుకు కాటా రోడ్డు వరకు సీసీ రోడ్డు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వాహన చోధకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి అభ్యర్థన మేరకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఎంపీటీసీ నిధుల నుంచి ఈ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రెండు వాహనాలు ఒకే మారు వెళ్లే అవకాశం ఉంటుందని రాకపోకలకు ఇబ్బంది లేకుండా రావికమతం నుంచి తక్కువ దూరం ప్రయాణంలో పాడేరు మాడుగులు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు కే ఎస్ యన్ ఎస్ రాజుకు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజా న కొండనాయుడుకు పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు వేపాడ శ్రీను పాల్గొన్నారు
Admin
Rapid TV