Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణం లో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా ట్రాఫిక్ విభాగంలోని విధానాలను సమీక్షించిన ఎస్పీ, పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణతో మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు కనిపించేలా విజిబుల్‌గా ఉండాలని ఆయన ఆదేశించారు. వాహనాల రద్దీ నివారణకు అనకాపల్లి పట్టణంలో అనువైన పార్కింగ్ స్థలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, వెలుతురు లేని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రధాన జంక్షన్ల వద్ద మైక్‌ల ద్వారా హెచ్చరికల పంపిణీ చేయడం వంటి చర్యలను వెంటనే అమలు చేయాలని సూచించారు.ఇదేక్రమంలో, ట్రాఫిక్ పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ, ముఖ్య జంక్షన్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేయాల్సిన కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా కొనసాగించాలన్నారు. అంతేగాక, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్ల వినియోగాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ , ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్.బి ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, ఎస్సై శేఖరం మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV