Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : రహస్యంగా పాన్ షాపులు, కిరాణా దుకాణాలలో అమ్మకాలు సాగిస్తున్న ఖైనీ , గుట్కా విక్రయాలపై నర్సీపట్నం రూరల్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శనివారం నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ పి రాజారావు, సిబ్బంది మండలంలోని వేములపూడి గ్రామంలో ఖైనీ, గుట్కా వంటి విక్రయాలపై తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ, చట్ట ప్రకారం విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఈ రకమైన నిషేధిత పదార్థాల అమ్మకం నేరంగా పరిగణించబడుతుందన్నారు . ఈ నేపథ్యంలో గ్రామంలోని పాఠశాలలు, కాలేజీలకు సమీపంగా ఉన్న అన్ని కిరాణా, పాన్ షాపులను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టామన్నారు. విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో ఎవరైనా ఖైనీ, గుట్కాలు వంటి ఉత్పత్తులు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Reporter
Rapid TV