Saturday, 12 September 2026 01:15:39 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

హోం మంత్రి అనితకు స్వాగతం పలికిన కలెక్టర్ రవి పటాన్ శెట్టి ,ఎస్పీ మురళీకృష్ణ

Date : 16 June 2024 03:06 PM Views : 1639

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పర్యటనలో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనితకు జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ స్వాగతం పలికారు అనకాపల్లి జిల్లా అధికారులతో హోం మంత్రి వంగలపూడి అనితకు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అరకొర వసతులతో, తీవ్ర ఇబ్బందుల మధ్య అధికారులు పనిచేస్తున్న విషయం మాకు తెలుసునని, త్వరలోనే అధికారులకు పూర్తిస్థాయి వసతులకు కల్పిస్తాం అని అన్నారు. మా ప్రభుత్వానికి అధికారులందరూ సహకరించండి, ఏటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రూల్స్ ప్రకారం పని చేయండి అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారుల రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి పనిచేశారు కొంతమంది అధికారులు కావాలని అతిచేసి పని చేశారనీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తే ఏ అధికారులను ఉపేక్షించేది లేదనీ హెచ్చరించారు.మా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమని అధికారులపై ఒత్తిడి చేయబోమనీ అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో మనం కలిసి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి ,ఎస్పీ మురళీకృష్ణ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :