Wednesday, 29 July 2026 01:26:06 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రైతాంగానికి యువతకి అండగా ఉంటా::: సీఎం రమేష్

Date : 03 May 2024 11:56 PM Views : 270

Rapid TV - Andhra Pradesh / Anakapally : *గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కు మంచి రోజులు ... ఉత్పత్తి పెరిగేలా ప్రణాళికలు ... *జిల్లాలో వైసీపీ ప్రభుత్వం లో మూసిన కర్మాగారలను ఇథనల్ తో అనుసంధానం చేసి రైతులుకు, స్థానిక యువతకు లాభదాయకంగా చేస్తాం ... *రైతులకు చెరుకు పేమెంట్లు వెంటనే అందేలా చర్యలు... *కార్మికులుకు అన్నీ విధాలుగా అండగా ఉంటాం అనకాపల్లి పార్లమెంట్ కి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ హామీ... *గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నుండి చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి.* *చోడవరం లో చెరుకు గానుగు రైతులతో ముచ్చట, బెల్లం తయారీ గురించి మరియు వారి సమస్యలు అడిగి తెలుసుకొని రైతన్నకు భరోసా.* *చెరుకు పండించేలా రైతులకు ప్రోత్సాహకలు అందజేస్తాము, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్ తో వేల ఎకరాలకు మంచి చేకురుతుంది అని అనకాపల్లి ఎం.పీ అభ్యర్థి శ్రీ సీ.ఎం రమేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం చోడవరం నియోజకవర్గం గోవాడ లో కూటమి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ KSNS రాజు మరియు జనసేన ఇంచార్జి శ్రీ PVSN రాజుతో కలసి గోవాడ చక్కర కర్మాగారం గేటు ముందు స్థానిక కార్మికులు తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ మాట్లాడుతు అనకాపల్లి జిల్లాలో గల షుగర్ ఫ్యాక్టరీల గురించి కొన్ని రోజులుగా అధ్యయనం చేస్తున్నాం అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్న కర్మాగారలు మూసేసారు అని గోవాడ లో ఉన్న కర్మాగారం లో ఉత్పత్తి తగ్గిపోయింది అని రైతంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు అని జూన్ 4 వ తేదీ తరువాత ప్రభుత్వం మారుతుంది ఇక్కడ రాజు మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు అని అదే విధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కు మంచి రోజులు వస్తున్నాయి. ఉత్పత్తి పెరిగేలా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని జిల్లాలో వైసీపీ ప్రభుత్వం లో ముసిన కర్మాగారలను ఇథనల్ తో అనుసంధానం చేసి రైతులు ను స్థానిక యువతకు లాభదాయకంగా చేసే భాద్యత తీసుకుంటున్నాం అని ప్రధాన డిమాండ్లు పరిస్కారిస్తామని రైతులకు చెరుకు పేమెంట్లు వెంటనే అందెల చర్యలు తీసుకుంటాం అని కార్మికులుకు అన్నీ విధాలుగా అండగా ఉంటాం అని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నుండి చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి అని తెలియజేసారు.అనంతరం చోడవరం లో చెరుకు గానుగు రైతులతో ముచ్చటించారు వారు బెల్లం తయారీ గురించి అడిగి తెలుసుకొన్నారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నా పట్టించుకోవడం లేదు అని తెలియజేయగా వారి సమస్యలుకు పరిస్కారం చూపిస్తాం అని రైతన్నకు భరోసా కల్పించారు.జిల్లాలో గల రైతాంగానికి చెరుకు పండించేలా రైతులకు ప్రోత్సాహకలు అందజేస్తాము, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్ తో వేల ఎకరాలకు మంచి చేకురుతుంది అని తెలియజేసారు. కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: