Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్సార్ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం దర్మ శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేతగా అందరి మనసుల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్నాడని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతమయ్యాయి అన్నారు ఫీజ్రి రీ యంబర్స్మెంట్ 108 వాహనాలు ఆరోగ్య శ్రీ తదితర కార్యక్రమాలు, రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ఆయనలా ఎవరు చేయలేకపోయారని ఆయన అందరికీ ఆదర్శప్రాయులని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదువాక సత్యారావు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు
Admin
Rapid TV