Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ సబ్బవరం.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో టిడిపి ఆర్గనైజర్ సెక్రెటరీ పల్లా తాతారావు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న గొల్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు బ్యాగ్ లను పంపిణీ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV