Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : అసాంఘిక కార్యకలాపాలపై నర్సీపట్నం రూరల్ పోలీసులు ఆదివారం పలు ప్రాంతాలలో డ్రోన్ కెమెరా సహాయంతో నిఘా చేపట్టారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రేవతమ్మ , రూరల్ ఎస్సై పి రాజారావు సిబ్బందితో కలిసి మండలంలోని అమలాపురం, ఎరకన్నపాలెం, కసిరెడ్డిపాలెం, వేములపూడి, పాములవాక శివారు గ్రామాల పరిసర ప్రాంతాల్లో పేకాట, కాయిన్ గేమ్స్, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై విస్తృత డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ, అసాంఘిక కార్యక్రమాలు, పేకాట, బహిరంగ మద్యపానం, కాయిన్ గేమ్స్ వంటి నేరపూరిత చర్యలు ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల కోసం ఇటువంటి నిఘా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు.
Reporter
Rapid TV