Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, నర్సీపట్నం:: కారు డోర్లలో దాచి ఉంచి రవాణా చేస్తున్న 50 కిలోల గంజాయిని శుక్రవారం నర్సీపట్నం రూరల్ సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు నర్సీపట్నం డిఎస్పి ఆధ్వర్యంలో రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు సిబ్బంది గొలుగొండ మండలం పాకలపాడు గ్రామ శివారులో మాటు వేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాడిలో చాకచక్యం చూపిన సిబ్బందికి డీఎస్పీ శ్రీనివాసరావు నగదు పురస్కారం అందజేశారు.
Reporter
Rapid TV