Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ నీ అచ్చుతాపురంలో నియోజకవర్గ పాస్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి సన్మానం చేసారు. అనంతరం పాస్టర్లు అందరూ కలిసి ఆయన కోసం ప్రార్ధన చేశారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ సీనియర్ దైవజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాస్టర్లకు పూర్తిగా అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ అవసరం వచ్చినా నన్ను కలవండని అన్నారు. ఈ సందర్భంగా తనను సన్మానించి నాకోసం దేవుని ప్రార్థించిన పాస్టర్లు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Reporter
Rapid TV