Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల నుంచి యువత జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర జనసేన నాయకులు లాలం చందు, యలమంచిలి నియోజకవర్గకోర్ కమిటీ సభ్యులు రుత్తల కనకరావు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్కళ్యాణ్ నాయకత్వం లో పనిచెయ్యాలని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి గా చూడాలని పార్టీ లో చేరాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో పవన్ విజయ్, బోలెం రాంబాబు, రుత్తల శ్రీను నరేష్, కొండబాబు, బైలపూడి సత్యం,లాలం నాని కసిరెడ్డి భాస్కరరావు పాల్గొన్నారు
Reporter
Rapid TV