Sunday, 13 September 2026 03:21:54 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

రాష్ట్రానికి కేంద్ర నిధులపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హర్షం

Date : 23 July 2024 06:15 PM Views : 173

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడి టీవీ:: ఏపీ అభివృద్ధికి దోహదపడనున్న కేంద్ర బడ్జెట్ - ఎంపి సీఎం రమేష్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ప్రత్యేక ఆర్థిక మద్దతుగా రూ.15వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం పట్ల కూడా రమేష్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చడానికి కావలసిన సహాయం అందించడానికి కేంద్రం మద్దతునిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ , భారీ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్‌కు ప్రత్యేక నిధులు కేటాయింపు చేయబడ్డాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్రం సాయం చేస్తుందని,అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ,రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించడంపట్ల కూడా రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల ,రంగంలో ఏపీకి అండగా నిలుస్తామని ప్రకటన చేసారన్నారు. కేంద్ర బడ్జెట్ లో 9 రకాలుగా ప్రాధాన్యత కల్పించబడ్డాయన్నారు.గ్రామీణాభివృద్ధికి 2.66 కోట్ల బడ్జెట్ కేటాయించడమే కాకుండా వాటి అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు. ముద్ర ఋణాలు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచారన్నారు.వేతన జీవులకు ఊరట కలిగె విధంగా బడ్జెట్ రూపొందించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ లో ఎన్నికల పర్యటనలో భాగంగా చెప్పిన విధంగా ఏపీ అభివృద్ధికి దోహదపడే లా బడ్జెట్ ఉందని సీఎం రమేష్ పేర్కొన్నారు.దేశ ప్రజల్లో విశ్వాసం కల్పించే విధంగా కేంద్ర బడ్జెట్ 2024-25 ను రూపొందించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపి రమేష్ ఆ ప్రకటనలో ధన్యవాదాలు తెలియచేసారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :