Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : అచ్చుతాపురం బ్రాండిక్స్ ఎస్ ఇ జెడ్ లో గల తాన్ యూన్ గార్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పని చేస్తున్న నక్క మాధురి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని, యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మునగపాక మండలం, అరబుపాలెం శివారు ఓంపోలు పేట ఎస్. సి. కాలనీ లో నక్కమాధురి కుటుంబాన్ని సీఐటీయూ జిల్లా బృందం ఈరోజు ఉదయం పరామర్శించారు. నక్క మాధురి యాజమాన్యం వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారని, ఈమె ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే కంపెనీ లోని కార్మికులంతా ఆందోళన నిర్వహించారని, మాధురి వలె అనేక మందిని వేధింపులకు గురి చేస్తున్నారన్న విషయాలు వీడియోలు, మెసేజ్ లు పంపారని తెలియ జేశారు. బ్రాండిక్స్అపరల్ సిటీలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్న బయటకు రాకుండా అనగతొక్కు తున్నట్లు తెలుస్తున్నాయన్నారు. మాధురి జాయిన్ అయిన 4 రోజులకే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే కంపెనీ లోపల కార్మికులు నరకాన్ని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు, అధికారులు వెంటనే కేసు నమోదు చేసి, లేబర్ అధికారులు కూడా తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్ రాము, కోశాధికారి వి వి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ ఎస్. బ్రహ్మాజీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, రావి దేముళ్లు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV