Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ జులై 22:: అనకాపల్లి జిల్లా పోలీసు 6వ విడతలో రికవరీ చేసిన 176 (రూ.25 లక్షల విలువగల) మొబైల్ ఫోన్లను సోమవారం తన కార్యాలయంలో బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపిఎస్., ఇప్పటి వరకు మొత్తం సుమారు 3500 ఫిర్యాదులు నమోదు కాగా, మొత్తం 6 విడతల్లో 1,756 మొబైల్ ఫోన్లు సుమారు రూ.2 కోట్ల, 45 లక్షల విలువ గలవి, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ మిస్సింగ్ పోర్టల్ CEIR (https://www.ceir.gov.in/) లో మీ యొక్క పోయిన మొబైల్ ఫోన్ వివరాలు అందించవచ్చు అన్నారు. ఆపై వెంటనే ఐటీ కోర్ బృందం ట్రేస్ చేస్తూ బాధితులకు మొబైల్స్ అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్:95052 00100 కు Hi అని టైప్ చేయడం ద్వారా (akpmobiletracker.in ) లింక్ నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్.ఐ.ఆర్ కట్టకుండా, పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా సులభతరం చేసిన జిల్లా పోలీసులు, మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ... 6 వ విడతలో భాగంగా ఈ రోజు 176 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు ఐటీ కోర్ టీమ్, పోలీసులు మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీసు స్టేషన్ లకు వెళ్ళడం పై అసౌకర్యంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో సులభతరమైన పధ్ధతిలో మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ మిస్సింగ్ కేసులలో త్వరితగతిన రికవరీ అవుతున్నందువలన ప్రజలు మొబైల్ మిస్సింగ్ పై ఫిర్యాదులు చేయుటకు ముందుకు వస్తున్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారం పై అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని, జిల్లా ఎస్పీ గారికి, అనకాపల్లి జిల్లా పోలీసులకు సెల్ పోన్లు పొందిన వ్యక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ బి.విజయభాస్కర్, ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, ఇన్స్పెక్టర్లు:చంద్రశేఖర్, అప్పలనాయుడు, కుమారస్వామి, గణేష్, ఎస్సై రఘు వర్మ మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV