Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో తూర్పుగోదావరి, కృష్ణాజిల్లా తీర ప్రాంతాలలో వెలికితీస్తున్న సహజవాయువు ఉత్పత్తులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, వచ్చే ఆదాయంలో 50% ఆంధ్రప్రదేశ్ కి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ), భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ (సిపిఎం), సీపీఐ ఎంఎల్ లిబరేషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకాపల్లిలో ప్రదర్శన చేశారు. 2024 జనవరిలో కాకినాడ దగ్గరలో ఉన్న కృష్ణ గోదావరి బేసిన్ ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని, ఇక్కడ కొన్ని లక్షల కోట్ల విలువచేసే సంపద ఉందని ఇందులో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Admin
Rapid TV