Saturday, 12 September 2026 08:03:10 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పూర్తి

ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్

Date : 19 July 2024 11:10 AM Views : 273

Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవమును పురస్కరించుకొని పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాస్ మూర్తి తెలిపారు. జిల్లా రెవెన్యూ, పోలీస్ మరియు జీవీఎంసీ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జులై 21 ఆదివారం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి నాలుగో విడత3 మడుగులు చందన సమర్పణ సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 20 శనివారం స్వామివారి ప్రచార రథం 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షణ జరుగుతుందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ప్రచార రథం సింహాద్రి అప్పన్న తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ బయలుదేరనున్నట్లు ఈవో తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సమారుగా రెండు లక్షలు మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఈవో తెలిపారు. అందుకు తగ్గట్టుగా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి పొడవునా దేవస్థానం తో పాటు సేవా సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలు, సహకారంతో భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు దారి పొడుగునా 20 పాయింట్లు లో వితరణ గావించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్న భక్తులకు రాత్రి 10:30 వరకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరుసటి రోజు తెల్లవారి ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకుండా ఏర్పాటు చేశాం.భక్తులకు త్రాగడానికి త్రాగునీరు . మరుగుదొడ్లు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం అన్నారు అలాగే భక్తులకి కొండ దిగి నుండి కొండపైకి వెళ్లడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు.... దేవాలయంలో అతి పెద్ద ఉత్సవం గిరిప్రదక్షిణ.. ముఖ్యంగా భక్తులు 5 లక్షలకు పైగా గిరి తిరుగుతారని ఒక అంచనాతో, వారికి 32 కిలోమీటర్ల దారిపోడవున మంచినీరు, మజ్జిగ, పాలు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించామన్నారు.. ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉత్సవాన్ని అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చెయ్యాలని కోరారు.. అదేవిధంగా దారి పొడవున సి. సి. కెమెరాలతో పోలీసులు మానిటరింగ్ చేస్తారని, ఈ సారి రోడ్లు కూడా జి. వి. ఏం. సి. అధికారులు భక్తులకోసం అందంగా తీర్చిదిద్దారని కొనియాడారు.. అదేవిధంగా స్వచంద సేవా సంస్థలు కూడా దారిపోడవున ప్రసాదాలను అందిస్తున్నారని తెలిపారు..గిరి ప్రదక్షిణ చుట్టూ పబ్లిక్ టాయిలెట్స్ ను, వైద్య సదుపాయాలను కల్పించారన్నారు.. గత చందనోత్సవం వలె, ఉచిత బస్సులలోనే భక్తులను కొండకు చెర వేస్తామ న్నారు.. వెహికల్స్ సింహాగిరిపైకి అనుమతి లేదని తెలిపారు..ఉత్సవాన్ని అధికారులు, దేవస్థానం సిబ్బంది స్వచ్ఛందంగా పనిచేసే భక్తులకు సేవచేసి వారికి అసౌకర్యం కలుగ కుండా చూడాలని తెలిపారు....

LAXMAN SIMHACHALAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: