Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ యలమంచిలి : నియోజకవర్గం లోని మునగపాక మండలం ఎంపీపీ మల్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీ బొజ్జా లక్ష్మి, రాజుపేట గ్రామ సర్పంచ్ కిల్లాడి దేముళ్ళు, చెర్లోపాలెం గ్రామ ఉపసర్పంచ్ బొజ్జా వెంకట శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు వీరందరికీఎమ్మెల్యే విజయ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ అలాంటి దుర్మార్గపు పాలనలో ఇన్ని రోజులు ఉన్నందుకు చాలా సిగ్గుపడ్డామని గడిచిన రెండు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి అలాగే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజకవర్గంలో సర వేగంగా పరుగులు పెట్టిస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని అన్నారు.గత ఎమ్మెల్యే కన్నబాబు దాచుకోవడం దోచుకోవడం తప్ప కనీసం కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదని తిరిగి మాపై దౌర్జన్యం చలాయించేవాడని ప్రస్తుత ఎమ్మెల్యే మేమందరం వేరే పార్టీ నుంచి వచ్చిన మమ్ములను గౌరవించే పద్ధతిని చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. మరి కొద్ది రోజులలోనే వైసిపి పార్టీ మొత్తంగా కాళీ అవబోతుందని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు టెక్కలి పరశురాం, తెలుగుదేశం మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు పారిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు*.
Reporter
Rapid TV