Wednesday, 29 July 2026 12:28:52 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

హోం మంత్రి అనిత జన నీరాజనాలు

గజ మాలలతో ఘన స్వాగతాలు పలికిన కూటమి నాయకులు

Date : 16 June 2024 12:21 AM Views : 220

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : పాయకరావుపేట లో పాండురంగ స్వామి దేవాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత తన కుమారుడు నిఖిల్ , కుమార్తె రేస్మిక లతో కలసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పాయకరావుపేట టౌన్ లో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హోం మంత్రి అనిత కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేశారు. అనిత వారందరినీ పేరు పేరు నా అభివాదం చేస్తూ ప్రతీ ఒక్కరికీ కరాచలనం చేశారు. కూటమి నాయకులు పాయకరావుపేట లో అడుగడుగునా గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. పాయకరావు పేట వై.జంక్షన్ నుండి ర్యాలీ గా బయలుదేరిన ఆమె కు జనం నీరాజనాలు పట్టారు. జాతీయ రహదారిపై ర్యాలీగా వెళుతున్న హోం మంత్రి అనిత ను చూడడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రతీ గ్రామం వద్ద జన నీరాజనాలతో పాయకరావు పేట నియోజకవర్గం హోరెత్తింది. ఈ విజయోత్సవ ర్యాలీ నక్కపల్లి ,అడ్డురోడ్డు ,ధర్మవరం మీదుగా 25 కిలోమీటర్ల మేర కొన సాగింది..ఈ విజయోత్సవ ర్యాలీ అనంతరం నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కు ఆలయ సాంప్రదాయ రీతిలో ఆలయ ఉద్యోగులు పండితులు స్వాగతం పలికారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనిత కు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు అనంతరం రాత్రి 11 గంటల సమయానికి నక్కపల్లి మండలంలోని సారిపల్లి పాలెం క్రిష్ టౌన్ షిప్ లో గల స్వగృహం కు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సి.ఐ లు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న ,నక్కపల్లి ఎస్.హెచ్ ఓ విజయకుమార్ పాయకరావుపేట ఎస్ హెచ్.ఓ ,అప్పలరాజు లతో పాటు ఎస్.రాయవరం ఎస్.ఐ విభూషణ రావు లు ఈ విజయోత్సవ ర్యాలీ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :