Rapid TV - Andhra Pradesh / Anakapally : సింహాచలం సింహాద్రి అప్పన్నను రాష్ట్ర హోమ్ మినిష్టర్ వంగల పూడి అనిత సోమవారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి అనితకు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు.. కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం ఈ సందర్భంగా హోంమినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అయిన తరువాత సింహాద్రి అప్పన్నను దర్శించుకోవాలని వచ్చానని అన్నారు. ప్రజలందరకు మంచి జరగాలని కోరుకున్నానని హోమ్ మినిస్టర్ అనిత తెలిపారు. వై. సి. పి. ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వారి తొత్తు లుగా వ్యవహారించారనీ, ఇప్పటికి వారిలో వై. సి. పి. రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారనీ, అవన్నీ మానికోవాలి, మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డి పై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోండనీ హోమ్ మినిస్టర్ వంగళపూడి అనిత అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా, అవసరమాయితే వారికోసం స్వయంగా నేను కూడా ధర్నా చేసి, న్యాయం కోసం పోరాడుతాననీ అన్నారు. అదేవిధంగా సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం అవకుండా చూస్తాననీ, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కూడా త్వరలో జరుగుతుందనీ అన్నారు.
Admin
Rapid TV