Saturday, 13 June 2026 02:31:10 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మంత్రి అమర్నాథ్ అవినీతి తెలిసే జగన్ టికెట్ ఇవ్వలేదు: కొట్ని బాలాజీ

Date : 21 February 2024 04:24 PM Views : 185

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పట్టణంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారి కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మలసాల భరత్ కుమార్ అనకాపల్లికి ఒక రాజకీయ టూరిస్ట్ అని, మలసాల కుటుంబానికి రాజకీయభిక్ష పెట్టింది టీడీపీ పార్టీయే అనీ ప్రజలందరికి తెలుసునని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అవినీతి జగన్ రెడ్డికి తెలిసే అనకాపల్లి సీటు ఇవ్వలేదని, అనకాపల్లి ఎం‌పి సత్యవతి పార్లమెంటులో జిల్లా సమస్యలు లేవనెత్తింది తక్కువ అని ఫోటోలు తీసుకోవడం ఎక్కువ అని, మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లినీ అభివృధ్ది చేస్తే సీటు ఎందుకు ఇవ్వలేదో?. మీకు ఎందుకు సీటు ఇచ్చారో సమాధానం చెప్పండనీ అన్నారు. రాజకీయ టూరిస్ట్ భరత్ కుమార్ కి అనకాపల్లి నియోజకవర్గ సరిహద్దులు తెలియదు, మొన్న శంఖారావం జరిగిన స్థలం అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి సౌత్ -1 రెవెన్యూలోకి వస్తుంది.కావాలంటే అధికారులతో చూసుకోండనీ అన్నారు. మలసాల కుటుంబం టీడీపీ పార్టీకి చేసిన ద్రోహం గురించి ప్రజలందరికీ వివరిస్తాం అని అన్నారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు 2500కోట్లతో నియోజకవర్గాన్ని అభివృధ్ది చేస్తే , మంత్రి అమర్నాథ్ 500కోట్లను ప్రజాధనాన్ని దోచుకున్నాడనీ విమర్చించారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీనీ మూసినందుకు రైతులే వైకాపా నాయకులకు గుండ్లు కొట్టించ డానికి సిద్దంగా ఉన్నారునీ అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ని కాపులే ఒడిస్తారని భయంతోనే జగన్ రెడ్డి అనకాపల్లి సీటు ఇవ్వలేదనీ, మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతలా అభివృధ్ది చేస్తే ఎందుకు పోటీ చేయటం లేదు.పోటీ చేయమనండి ప్రజలు కోడి గుడ్లతో కొడతారన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటే వైకాపా శ్రేణులకే ఇష్టం లేదు.అందుకే మీకు సీటు ఇవ్వాలనీ ఒక్క వైకాపా కార్యకర్త అయిన మాట్లాడ లేదు .కనీసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదనీ విమర్చించారు. నాలుగేళ్లుగా కేంద్రీయ విద్యాలయం కోసం చెప్పడం ప్రజలందరూ చూడడం అలవాటు అయిపోయింది. అనకాపల్లి ప్రజలకు ఎం‌పి గారు ఏం చేశారో చెప్పే దైర్యం ఉందా అని ప్రశ్నించారు. *రాష్ట్రానికీ పరిశ్రమలు తీసుకువచ్చిన లోకేష్ గారికీ, వందల కోట్లు దోచుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కి చాలా తేడా ఉంది.* *అనకాపల్లికి వచ్చిన మెడికల్ కాలేజీని తరలించుకుపోయినా ఎంపి సత్యవతీ ఏం చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు. *టి‌డి‌పి-వైకాపా హయాంలో అనకాపల్లి నియోజకవర్గ అభివృద్దిపై మేము చర్చకు సిద్దం.మేము సాక్షాధారాలతో సహ నాలుగు రోడ్ల జంక్షన్ కి వస్తాము. చర్చకు రండి అని సవాల్ విసిరారు .ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ,ఎంపీటీసీ నారపిన్ని చంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ కర్రీ బాబీ, క్లస్టర్ ఇంచార్జీ తలారి కాశీనాయుడు,శెట్టి వెంకట రమణ,సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, మధుపాడ నరసింగరావు,అక్కిరెడ్డి రమణబాబు,సైనిక్ సత్యనారాయణ,మోయ్యా నూకరాజు,పృధ్వీ, ప్రదీప్, పిట్ల హరీష్, జెర్రిపోతుల నూకరాజు, కరణం కోటి, ముప్పిడి మణికంఠ, చైతన్య,తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :