Thursday, 30 July 2026 04:48:06 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

Date : 22 July 2024 05:45 PM Views : 218

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ జూలై 22:: *ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌కు జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలి* *జవాబుదారీతనంతో స్పందించాలి..* *జిల్లా అధికారులకు దిశా నిర్దేశం* *ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌కు 175 విన‌తులు* జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ *అనకాపల్లి, జూలై 22: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీదారుల సమస్యలపై జవాబుదారీతనంతో స్పందించి, అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని సూచించారు. పీజీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీనికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.* *సోమవారం ఉదయం క‌లెక్ట‌ర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ కార్యక్రమం జిల్లా క‌లెక్ట‌ర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వయంగా ఆలకించి స్వీక‌రించారు. వెంటనే సంబంధిత శాఖాధికారుల‌కు సిఫార్సు చేసి, అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు త‌ప్ప‌కుండా అర్జీదారుల‌తో మాట్లాడాల‌ని, స‌మ‌స్య పూర్వాప‌రాలు తెలుసుకొని స‌రైన ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు. నిర్ణీత సమయంలోగా అర్జీదారుని స‌మ‌స్య‌కు నాణ్య‌మైన ప‌రిష్కారం చూపాలన్నారు. గ్రామ మరియు మండల స్థాయిలో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, తద్వారా జిల్లా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ కార్యక్రమానికి అర్జీదారుల సంఖ్య తగ్గుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.* *ఈ కార్యక్రమంలో జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు డిప్యూటీ కలెక్టర్లు ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి , రమామణి భాగస్వాములై అర్జీదారుల నుంచి పలు విన‌తులను స్వీక‌రించారు. అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు, ఇత‌ర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.* స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌కు 175 విన‌తులు సోమ‌వారం నిర్వహించిన ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌కు ప్ర‌జ‌ల నుంచి వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 175 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖ‌కు (సి సి ఎల్ ఏ) చెందిన‌వి 102 ఉండ‌గా, పోలీసు శాఖకు సంబంధించి 13, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి 14, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి 5 ఉన్నాయి. అలాగే ఇత‌ర విభాగాల‌కు సంబంధించి 32 వినతులు వ‌చ్చాయి.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: