Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి, రాపిడ్ టీవీ::, జూలై 25: జిల్లా ఎస్పి శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మమేకమై ఫిర్యాదు దారుల పట్ల జవాబుదారీతనం వహించాలని వారి సమస్యల పై సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. మహిళలు, బాల బాలికలపై జరిగే నేరాలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. దొంగతనాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు పగలు, రాత్రి గస్తీలను పునర్వ్యవస్థీకరించి నేరాలు నివారించేందుకు పటిష్ట గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు మరియు రవాణా జరిగే మార్గాలలో ఆకస్మిక/ డైనమిక్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. తీవ్రమైన కేసుల సీడీ ఫైల్స్ ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని, రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ అప్పలరాజు, అనకాపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ రావు, ఎస్సై తేజేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Rapid TV