Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి అధికారులతో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తామని తెలిపారు. పంచాయతీ రాజ్ అతిథి గృహం నిర్వహణ పై మండి పడ్డారు. నేను నాకోసం పనిచేయమని అడగను మీరు పని చేయాల్సింది ప్రజలకోసం సేవ చేయాల్సింది ప్రజలకి ,జీతం తీసుకునేది ప్రజల డబ్బులు అని గుర్తుంచుకోవాలన్నారు. హోం మంత్రి ఉన్న నియోజకవర్గ పరిధిలోని పనిచేయడం మీ అదృష్టంమో దురదృష్టమో మీకే తెలియలి అన్నారు. ప్రతీ సమస్య కు పరిస్కారం ఉంటుందని పరిస్కారం లేని సమస్యలు ఉండవన్నారు. నా పాయకరావు పేట నుండే ప్రక్షాళన మొదలు పెట్టాలని అనుకుంటున్నానుఅని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు గా పాయకరావుపేటని తీర్చిదిద్దుతాను అని హామి ఇచ్చారు. నా పేరు చెప్పి అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము అని ఎవరైనా ప్రజలను డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వొద్దు అని కోరారు. పాయకరావుపేట నిబంధనలకు విరుద్ధంగా లే ఔట్లు వేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. ఇక మీదట ఎక్కడ పడితే అక్కడ లే ఔట్లు వేస్తే సహేంచేది లేదన్నారు. గత ప్రభుత్వం లో లా ఎన్.డి ఏ కూటమి ప్రభుత్వం లో మీ ఇష్టారాజ్యంగా పనిచేస్తాను అంటే సహించేది లేదన్నారు.ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. అంతకుముందు పాయకరావుపేట అతిధి గృహం నకు చేరుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత ను కూటమి నాయకులు ,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో అతిథి గృహం కిక్కిరిసిపోయింది.
Reporter
Rapid TV