Rapid TV - Andhra Pradesh / Anakapally : వడ్డాది వేంకటేశ్వరస్వామి 151వ కల్యాణ మహో త్సవాలను భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ . అనకాపల్లి జిల్లా వడ్డాదిలో 5 రోజులు పాటు వడ్డాది వేంకటేశ్వరస్వామి 151వ కల్యాణ మహోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న బారికేడ్ లు, క్యూ కాంప్లెక్స్ లు , పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం తదితర ఏర్పాట్లపై అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎస్.అప్పలరాజు, కొత్తకోట సిఐ ఎల్.అప్పలనాయుడు, బుచ్చయ్యపేట ఎస్సై డి.ఈశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
Rapid TV