Sunday, 13 September 2026 10:46:46 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

విద్యారంగ సమస్యలపై అనకాపల్లి DEO కి మెమోరండం సమర్పించిన యుటిఎఫ్ నాయకులు

Date : 25 July 2024 07:23 PM Views : 223

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలు సత్వరమే పరిష్కారం చేయమని కోరుతూ రాష్ట్ర యూటీఎఫ్ పిలుపు మేరకు యూటీఎఫ్ అనకాపల్లి జిల్లా శాఖ ఈరోజు సాయంత్రం అనకాపల్లి DEO శ్రీమతి M. వెంకటలక్ష్మమ్మ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అపరిష్కృతoగా ఉన్న సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ క్రింది ప్రధాన డిమాండ్లను వారు మెమోరాండంలో పొందుపరచారు. 1) జీవో నెంబర్ 117 రద్దుచేసి జిఓ ఎంఎస్ నెంబర్ 55 తేదీ 23. 4 2021 ప్రకారం టీచర్ల ను కేటాయించాలి. 2) ఫ్రీ ప్రైమరీతోపాటు ఒకటి నుండి ఐదు తరగతులు ఒకే పాఠశాలగా నడపాలి. 3) రాష్ట్రవ్యాప్తంగా ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం అమలు చేయాలి. 4) హై స్కూల్స్ నందు రెండు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలి. 5) ఉపాధ్యాయులను బోధ నేతర పనుల నుండి మినహాయించాలి,పని భారం తగ్గించాలి. 6) హై స్కూల్స్ నందు నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలి. 7) ఒక కిలోమీటరు పైబడి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి. 8) స్థానిక ప్రాంతాల పరిస్థితులను బట్టి మధ్యాహ్నం భోజనం మెనూ సవరించాలి. 9) మునిసిపల్ టీచర్ల పీఎఫ్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. 10) గిరిజన ప్రాంతాలలో ప్లస్ టు స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. 11) గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టిలను ,భాషా వాలంటీర్లను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. 13 కోవిడ్ సమయంలో మరణించిన మోడల్ స్కూల్ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలు కల్పించాలి. 14) మోడల్ స్కూల్ టీచర్ల సర్వీసును వెంటనే విడుదల చేయాలి, పీజీటీలకు జూనియర్ లెక్చరర్ హోదాలో కల్పించాలి. 15) ఎయిడెడ్ నుండి స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ పాఠశాలలో అబ్జార్బ్ అయిన ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. 16) ఎయిడెడ్ పాఠశాలల ఖాళీలను భర్తీ చేసేందుకు తగు చర్యలు గైకొనాలి. 17) మినిమం టైం స్కేలు ఉపాధ్యాయుల సర్వీసును రెగ్యులర్ చేయాలి. 18) ప్లస్ టు పాఠశాలల్లో పిజిటి పోస్టులను ప్రమోషన్లు ఇవ్వాలి. 19 పాఠశాలలకు రావలసిన అన్ని రకాల గ్రాంట్లు మంజూరు చేయాలి. విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి 20. వేసవి సెలవులలో నాడు నేడు, ప్లస్ టు తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత శెలవులు మంజూరు చేయాలి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అపరిష్కృతoగా ఉన్న సమస్యల పరిష్కారానికి DEO గారి ద్వారా కొత్త ప్రభుత్వానికి నివేదిoచాలని కోరగా, DEO గారు స్పందిస్తూ ఈ సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో UTF జిల్లా అధ్యక్షులు శ్రీమతి వి. శ్రీలక్ష్మి, సీనియర్ నాయకులు GS ప్రకాష్, M. V. అప్పారావు, బండారు శంకర్, మాకిరెడ్డి రాజునాయుడు, సలీం, గొంది ఈశ్వరరావు, దేముడు నాయుడు, మామిడి బాబూరావు, ఆశ, తేజ్ వర్ధన్, శివయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sanjeev anakapalli

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: