Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆశా కార్యకర్తల జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి వజ్రపు సత్యవతి మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా ఆశ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని, ఆశ కార్యకర్తలకు కనీస వేతనాలు మంజూరు చేయాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ కార్యకర్తలుగా గుర్తించాలని అప్పటివరకు ఆశా కార్యకర్తలతో సమానంగా అన్ని అలవెన్స్ లో ఇవ్వాలని ఫైవ్ జి మొబైల్స్ సిమ్ కార్డులు నాణ్యమైన యూనిఫారాలు పి హెచ్ సి కు వివిధ పనులపై వచ్చినప్పుడు టీఏ డీఏలు ఇవ్వాలని రికార్డులు అదనపు పనులు చేయమని సూచిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా ప్రభుత్వ మే నియామకాలు చేపట్టాలని నినాదాలు చేశారు కార్యక్రమాలు రామ దేవి రాము సత్య లవలక్ష్మి నాగ మణి ఉమా తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV