Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడ్ న్యూస్ : అరుకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ 2 ప్రోగ్రాం అధికారి వై విజయలక్ష్మి ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ప్రోగ్రాం అధికారిగా ఎందుకైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే భరత్ కుమార్ నాయక్ తెలియజేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం లో జరిగే స్వతంత్రం దినోత్సవ వేడుకల్లో వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా విజయలక్ష్మి కి ఉత్తమ జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి అవార్డును అందచేస్తారని తెలిపారు . ఈ మేరకు ఏయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.హరినాథ్ నుండి సమాచారం కళాశాలకు అందినట్లు చెప్పారు. కాగా ఉత్తమ జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి అవార్డుకు ఎంపికైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేస్తూ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ కు, కళాశాల అధ్యాపకులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు తన ధన్యవాదాలు తెలియజేశారు.
Reporter
Rapid TV