Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ఆదివారం ఆగస్టు 4:: అనకాపల్లి ఎంపి C.M రమేష్ తన కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు తీర్పు చాలా సంతోషకరo అని అన్నారు. ఆలస్యమైనా ప్రధానమంత్రి చొరవతో న్యాయం జరిగిందనీ అన్నారు. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రి ఘట్కరి తో చర్చించాగా వెంటనే టెండర్లు పిలిచి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్తవలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అలాగే అనకాపల్లి జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లో ఆగని కొన్ని రైళ్లు హాల్ట్ కల్పించాలని, కొన్ని స్టేషన్లో రైతుల సౌలభ్యం కోసం ట్రైన్ హాల్టింగ్ సమయం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్ ను మోడరన్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కూడా రైల్వే మంత్రికి వినతిపత్రం ఇచ్చాను. మాడుగుల చోడవరం నియోజకవర్గాల పరిధిలో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాను... ఇప్పటికే పలు కంపెనీలు మన ఇండస్ట్రియల్ జోన్ లో కంపెనీలు నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. వారితో చర్చలు జరుగుతున్నాయి. చైనాలో మాదిరిగా ఈ ప్రాంతంలో ఫర్నిచర్ క్లస్టర్ నెలకొల్పి పెద్ద ఎత్తులో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాము... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపు టిడిపి పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎవరు అనేది సీఎం చంద్రబాబు నాయుడు మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించడం జరుగుతుందనీ అన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో mlc అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, ప్రగడ నాగేశ్వరరావు, కొట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV