Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా: యలమంచిలి నియోజకవర్గం, మండలంలోని ఏటికొప్పాక గ్రామంలో నిర్వహించిన సభ్యత నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ఎంపీ రమేష్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీ బిజెపి పార్టీ అని జాతీయ పార్టీలలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. 2024 సంవత్సరానికి గాను ఏటికోప్పాక గ్రామంలో 300 సభ్యత్వాలు నమోదు అయిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం బిజెపి పార్టీలో చేరాలని బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిజెపి పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ వర్మ మాట్లాడుతూ యువత భారతీయ జనతా పార్టీ ని ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరుతున్నారని, కూటమి నాయకత్వంతో ఎంపీ సీఎం రమేష్ కి ఎంత మెజార్టీ వచ్చిందో అనకాపల్లి పార్లమెంటులో అంతకుమించి సభ్యత నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. బిజెపి పార్టీ అంటేనే దేశం కోసం, ధర్మం కోసం పార్టీ అని, బిజెపి పార్టీ యొక్క సిద్ధాంతమని, బిజెపి పార్టీలో చేరిన వాళ్ళు మొదట దేశం గురించి, తర్వాత పార్టీ గురించి పని చేస్తారని తెలిపారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అంటే ముందర మనకేంటి, మనం ఎంత సంపాదించుకుంటున్నావు అన్నది చూసుకుంటున్నాయి తప్పించి దేశం గురించి ధర్మం గురించి పట్టించుకోవట్లేదు అని, బిజెపి పార్టీ సిద్ధాంతం కాదని అన్నారు.
Reporter
Rapid TV