Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ, సబ్బవరం :: సబ్బవరంలో సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న భారత సైన్యం కు శఘీభావం ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రో. డి. సూర్యప్రకాశరావు తెలిపారు. ఈ మేరకు శనివారం అధ్యాపకులు, అధ్యపకేతర సిబ్బంది, విద్యార్థుల యూనివర్సిటీ అకాడమిక్ బ్లాక్ యొక్క ప్రధాన ద్వారం దగ్గర చేరుకొని సంఘీభావం ప్రక టించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రో. డి. సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ ఇన్నాళ్ళు సహనాన్ని పాటించిన సైన్యం వీడి సాహసం ప్రదర్శించడానికి సిద్దమైన సమయంలో జాతి మొత్తం సంఘాటితం గా భారత సైన్యం భారత ప్రభుత్వం వెనుక మేము ఉన్నాము అని నిలబడ వాల్సిన సమయం అని తెలుపుతూ అందుకు అందరూ ఎలాంటి భేద అభిప్రాయాలు లేకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
Reporter
Rapid TV